AP: టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాసరావు హాజరయ్యారు. MP కేశినేని శివనాథ్(చిన్ని), కొలికపూడి మధ్య వివాదం నేపథ్యంలో ఇరువురూ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుకావాలని ఇటీవల పార్టీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, కమిటీ ఎదుట కొలికపూడి వివరణ ఇచ్చారు. సా.4 గంటలకు MP కేశినేని చిన్ని కమిటీ ముందుకు రానున్నారు.