MBNR: మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఎదిర వార్డులో పారిశుద్ధ్యం పూర్తిస్థాయిలో కనుమరుగయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వార్డులో మురుగునీరు రోడ్లపై పారుతున్న ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరూ పట్టించుకోవడంలేదని కాలనీవాసులు పేర్కొన్నారు. మురుగునీటి కారణంగా ఇళ్ల మధ్య నీరు నిలిచిపోయి దోమల సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఇటీవల ఎంతోమంది డెంగ్యూ బారిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.