VKB: కొడంగల్ మెడికల్ కళాశాల, గురుకులాలను కొడంగల్లోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ నిరసన కొనసాగుతోంది. విద్యా సంస్థలను ఇతర ప్రాంతాలకు తరలించొద్దని కోరుతూ, జేఏసీ నాయకులు వినూత్న నిరసనకు దిగారు. కొడంగల్లోనే ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానిక పోస్ట్ ఆఫీస్ ద్వారా ముఖ్య మంత్రి కార్యా లయానికి పెద్ద సంఖ్యలో పోస్టు కార్డులను పోస్ట్ బాక్సుల్లో వేశారు.