W.G: జిల్లాలో గడిచిన 24 గంటల్లో 112.8 మీమీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు మంగళవారం తెలిపారు. ఇందులో తాడేపల్లిగూడెంలో 48.2 మీమీ అత్యధిక వర్షపాతం నమోదైంది. పెంటపాడులో 32.4 మీమీ, అచంటలో 20 మీమీ, నరసాపురంలో 6.2 మీమీ, మొగల్తూరులో 2.2 మీమీ చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.