KMR: దేవునిపల్లి సిద్ధి వినాయక నగర్ కాలనీలో చంద్రమోహన్ రెడ్డి ఇంట్లో భారీ చోరీ జరిగింది. బాధితుడు హైదరాబాద్ వెళ్లి తిరిగి వచ్చే సరికి మంగళవారం ఇంట్లో అంతా చెల్లాచెదురుగా ఉన్నాయి. 6.5 తులాల బంగారం, 1.75 కిలోల వెండి, లక్షన్నర నగదు దొంగిలించినట్లు బాధితుడు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీం, సీసీ కెమెరాల ద్వారా వివరాలు సేకరిస్తున్నారు.