SRD: సిర్గాపూర్ శివారులోని వాగు వద్ద రోడ్డు కోతకు గురైంది. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు స్థానిక కల్వర్టు రోడ్డు వరద జలాలకు కొట్టుకుపోయింది. రోడ్డు మధ్య రంద్రం పడింది. దీంతో ప్రయాణికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానిక ప్రజలు వాహనదారులు నేడు తెలిపారు. అధికారులు స్పందించి వెంటనే కోతకు గురైన రోడ్డుకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.