W.G: రైతులు తమ పంటను వాట్సాప్ ద్వారా అమ్ముకునేలా ప్రభుత్వం సేవలు ప్రారంభించిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 7337359375 నంబరుకు వివరాలు పంపించడం ద్వారా ఈ సేవలు వినియోగించుకోవచ్చని ఆయన వివరించారు. సోమవారం తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలనులో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. 45 వేల పాఠశాలలు, 3,600 హాస్టళ్లకు సన్న బియ్యం అందిస్తున్నామన్నారు