TG: కొడంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ముందుకు వచ్చింది. అయితే ఒక సంవత్సరం నుంచి ఈ ఫౌండేషన్ ఇక్కడ ఉదయం అల్పాహారం అందిస్తోంది. దీంతో పాటు మధ్యాహ్న భోజనం కూడా సరఫరా చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఈ నెల 14న కొడంగల్ సమీపంలోని ఎన్కేపల్లిలో నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ కిచెన్ శంకుస్థాపన చేయనుంది.