HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుస్తారని సినీ నటుడు సుమన్ ధీమా వ్యక్తం చేశారు. నవీన్‌కు మద్దతుగా నటుడు సుమన్ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు ప్రజల్లో విశేష స్పందన ఉందని, అన్ని వర్గాల నుంచి వస్తున్న ఆదరణ చూస్తుంటే గెలుపు తథ్యమని సుమన్ పేర్కొన్నారు.