TG: పదేళ్లు జూబ్లీహిల్స్‌ను KCR పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడు బిల్లా రంగాలు ఆటోల్లో వచ్చి.. ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. ఆడబిడ్డలకు ఉచిత బస్సు ఇస్తే ఓర్వలేక.. దాన్ని తీసేయాలంటున్నారని ధ్వజమెత్తారు. గతంలో మహిళలకు KCR మంత్రి పదవి కూడా ఇవ్వలేదని.. కానీ తాము పెత్తనం అంతా మహిళా సంఘాల చేతుల్లోనే పెట్టామని అన్నారు.