ప్రకాశం: ప్రజా ఉద్యమంలా కోటి సంతకాల కార్యక్రమం వైసీపీ చేపట్టిందని మార్కాపురం ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. శనివారం తర్లుపాడు మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. తక్షణమే జీవోలను రద్దు చేసి కాలేజీల నిర్మాణం, నిర్వహణ ప్రభుత్వమే చేపట్టాలని వారి డిమాండ్ చేశారు.