NRML: మద్దతు ధర ఇచ్చి వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అన్నారు. శనివారం ఖానాపూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని నిర్వాహకులను ఆదేశించారు.