అన్నమయ్య జిల్లాలోని నిమ్మనపల్లె మండలం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో 95.68% సమీక్షతో శనివారం మొదటి స్థానాన్ని సాధించిందని ఎంపీడీవో రమేశ్ తెలిపారు. ఈ మేరకు సచివాలయ, రెవెన్యూ అధికారులు ఉదయం 7 గంటల నుంచి ఇంటింటికీ వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. ఈ మేరకు మొత్తం 5,049 పింఛన్లలో మధ్యాహ్నం 2 గంటల వరకు 4,831 పింఛన్లు అందజేయబడ్డాయని ఆయన పేర్కొన్నారు.