CTR: చిత్తూరు నగరంలో రోడ్ల విస్తరణ వేగం పుంజు కుంటోంది. ఈ మేరకు మహావీర్ బ్రిడ్జికి దగ్గరలో కలెక్టర్ బంగ్లా వద్ద రోడ్డును వెడల్పు చేస్తున్నారు. సుమారు 2.25 లక్షల జనాభా, వచ్చి పోయే వాళ్ళతో 4 లక్షలు ఇబ్బంది లేకుండా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చొరవతో రోడ్డు పనులు పూర్తి అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.