MNCL: జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్ హెచ్ విఆర్ సర్వే కొనసాగుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే బృందం సభ్యులు శనివారం జన్నారం మండలంలోని అల్లీనగర్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆ పాఠశాలలో ఉన్న మౌలిక సౌకర్యాల గురించి పాఠశాల హెచ్ఎంను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు.