SKLM: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. శనివారం పాతపట్నం మండలం కేంద్రంలో దుర్గమ్మగుడి వీధిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇంటి వద్ద ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు నాయకులు పాల్గొన్నారు.