సూపర్ స్టార్ మహేశ్ బాబు(mahesh babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(trivikram) కలయికలో ఇప్పటివరకూ రెండు సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల టైటిల్స్ అతడు, ఖలేజా. ఈ టైటిల్స్ పవర్ ఫుల్‌గా ఉన్నాయి. కానీ ఈ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీకి టైటిల్ ఫిక్స్ అవడం లేదు. దాంతో రోజుకో టైటిల్ తెరపైకి వస్తోంది. తాజాగా మరో కొత్త టైటిల్ వైరల్ అవుతోంది.
మహేష్(mahesh), త్రివిక్రమ్(trivikram) కాంబోలో వస్తున్న లేటెస్ట్ ఫిల్మ్.. SSMB 28 వర్కింగ్ టైటిల్‌తో సెట్స్ పైకి వెళ్లింది. హారిక, హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో.. పూజా హెగ్డే, శ్రీలీలా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రజెంట్ SSMB 28 షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చారు. మహేశ్ బాబు ఫ్యామిలీతో ఫారిన్ వెకేషన్లో ఉన్నాడు. తాజాగా మహేశ్ దిగిన ఒక సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో మహేష్ సమ్మర్ వెకేషన్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడని అంటున్నారు నెటిజన్స్. మహేష్ తిరిగి రాగానే ఎస్ఎస్ఎంబీ 28 కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. అయితే ఈ లోపు SSMB 28 టైటిల్ అనౌన్స్మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.
మే 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ సినిమాకి అయోధ్యలో అర్జునుడు, అమరావతికి అటు ఇటు, ఊరికి మొనగాడు, గుంటూరు కారం.. అనే టైటిల్స్‌ని పరిశీలిస్తున్నట్లు, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి.
వీటిలో ‘గుంటూరు కారం’ దాదాపుగా ఫిక్స్ అయిపోయిందని అన్నారు. కానీ ఇప్పుడు మరో కొత్త టైటిల్ తెరపైకి వచ్చింది. ‘పల్నాడు పోటుగాడు’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారట. ఇదే టైటిల్‌ను ఖరారు చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.
ఈ సినిమా కథ మొత్తం పల్నాడు ప్రాంతం బ్యాగ్‌డ్రాప్‌తో సాగుతుందట. అందుకే ఈ టైటిల్ పర్ఫెక్ట్ ఉంటుందని భావిస్తున్నారట. అయితే త్రివిక్రమ్ ‘అ’ సెంటిమెంట్‌ను పక్కకు పెట్టి.. ఇలాంటి టైటిల్స్ వినిపించడం విశేషమే. కాబట్టి మే 31 వరకు ఈ సినిమా టైటిల్ పై క్లారిటీ రావడం కష్టమే.
ఇది కూడా చూడండి:Iswarya Menon: స్పై బ్యూటీ ఐశ్వర్య మీనన్ అందాలు చుశారా?