KDP: భగవద్గీతపై అనుచిత వ్యాఖ్యలు తగవని BJP జిల్లా అధికార ప్రతినిధి గాలి హరిప్రసాద్ అన్నారు. గురువారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ.. TTD పాలక మండలి సభ్యుడు ఎంఎస్. రాజు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన ఖండించారు. భగవద్గీత, రామాయణం, మహాభారతం హైందవ సంప్రదాయాల్లో పవిత్రమైన గ్రంథాలని పేర్కొన్నారు. కోట్ల మంది హిందువులు తమ జీవన శైలిలో భగవద్గీత అంతర్భాగం అన్నారు.