KMR: బిక్కనూరు మండల కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం 2K రన్ నిర్వహించడం జరుగుతుందని ఎస్సై ఆంజనేయులు గురువారం తెలిపారు. మండల కేంద్రంలోని చర్చి ప్రాంతం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ఈ రన్ సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యువకులు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు.