కోనసీమ: విద్యుత్ షాక్తో మృతి చెందిన ఇద్దరు వ్యక్తుల కుటుంబాలకు మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆర్థిక సహాయం అందించి, అండగా నిలిచారు. ఇటీవల విద్యుత్ షాక్తో ద్రాక్షారామ గ్రామానికి చెందిన దొంగల భీమశంకరం, రామచంద్రపురంకి చెందిన బూర్ల చైతన్య కృష్ణ కుటుంబాలకు ఒక్కక్కరికి రూ. 25వేలు చొప్పున బుధవారం రాత్రి అందజేశారు.