Steel Plant:విశాఖ స్టీల్ ప్లాంట్ (Steel Plant) వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అడ్మినిస్ట్రేటివ్ భవనం ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. భవనం వైపు వాహనాలు వెళ్లకుండా అడ్డుకున్నారు. సెయిల్ (SAIL) తరహాలో తమకు వేతన ఒప్పందం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పోరాట కమిటీ నేతలు యాజమాన్యంతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. అక్కడ ఉన్న బారికేడ్లు తొలగించి అడ్మిన్ భవనంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో హై టెన్షన్ నెలకొంది. వేతన ఒప్పందం గురించి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నుంచి సమాధానం వచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తామని కార్మికులు స్పష్టంచేశారు.