Actress Purna: మొదటిసారి తన కొడుకును చూపించిన పూర్ణ
గత నెల ఆరంభంలో పూర్ణ(Actress Purna) దంపతులు తమ ఫస్ట్ చైల్డ్ కు స్వాగతం పలికారు. ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాధిస్తున్న పూర్ణ తొలిసారి తన కుమారుడిని అందరికీ చూపించింది.
ఢీ షో జడ్జ్, ప్రముఖ నటి పూర్ణ(Actress Purna) మొదటిసారి తన బిడ్డను చూపించింది. గత ఏడాది వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన పూర్ణ దుబాయ్ వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ కంపెనీ సీఈవో అయిన షానిద్ ఆసిఫ్ అలీని వివాహం చేసుకుంది. దుబాయ్లో వీరి పెళ్లి వేడుకగా జరిగింది. పెళ్లి జరిగిన కొద్ది నెలలకే ప్రెగ్నెంట్ అయిన పూర్ణ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
గత నెల ఆరంభంలో పూర్ణ(Actress Purna) దంపతులు తమ ఫస్ట్ చైల్డ్ కు స్వాగతం పలికారు. ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాధిస్తున్న పూర్ణ తొలిసారి తన కుమారుడిని అందరికీ చూపించింది. కొడుకు, భర్తతో పాటు ఫోటో దిగి ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. `ది ప్రిన్స్` అని తన కొడుకును ఉద్ధేశిస్తూ కామెంట్ చేసింది.
నటి పూర్ణ(Actress Purna) పోస్ట్ చేసిన కొద్ది క్షణాల్లోనే ఆమె ఫోటో వైరల్ అయింది. పూర్ణ కుమారుడిని చూసి నెటిజన్లు బాబు చాలా క్యూట్ గా ఉన్నాడంటూ కొందరు, సేమ్ తల్లి పోలికే ఉన్నాడంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. కెరీర్ విషయానికి వస్తే పూర్ణ ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లు, టీవీ షోలలో కనిపిస్తోంది. ఈ మధ్యనే పూర్ణ `దసరా` మూవీలోనూ నటించింది.