ప్రకాశం: కనిగిరి మున్సిపల్ పరిధిలోని మాచవరం గ్రామానికి చెందిన గురవమ్మపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు ప్రకాశంను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ ఐద్వా ఆధ్వర్యంలో మహిళాసంఘాలు నిరసన ర్యాలీ నిర్వహించాయి. 45 రోజులు గడిచినా పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ, పోలీస్టేషన్ ముందు బైఠాయించారు. పోలీసులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.