MBNR: గత ప్రభుత్వం మత్స్యశాఖను భ్రష్టు పట్టించిందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారం నియోజకవర్గంలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టులో చేప పిల్లలను వదిలి మాట్లాడారు. ఈ సారి 82 మిల్లీ మీటర్ల సైజు, 2లక్షల, 50,000వేల చేప పిల్లలను వదిలామని, మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.