»Prashant Kishor Injured To Take Time Off Jan Suraaj Padyatra In Bihar
Prashant Kishor : రాజకీయ చాణుక్యుడు ప్రశాంత్ కిషోర్ కు గాయాలు
దేశంలో రాజకీయ వ్యూహకర్తగా పేర్గాంచారు ప్రశాంత్ కిషోర్. ప్రస్తుతం ఆయన సామాజిక కార్యకర్తగా బీహార్ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారు. తన పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. తనకు గాయం కారణంగా బీహార్లో జన్ సూరాజ్ పాదయాత్రకు నెల రోజుల పాటు దూరంగా ఉండనున్నారు. గాంధీ జయంతి నాడు ప్రారంభమైన పాదయాత్ర ఇప్పుడు దాదాపు 15 రోజుల తర్వాత తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు.
Prashant Kishor : దేశంలో రాజకీయ వ్యూహకర్తగా పేర్గాంచారు ప్రశాంత్ కిషోర్. ప్రస్తుతం ఆయన సామాజిక కార్యకర్తగా బీహార్ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారు. తన పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. తనకు గాయం కారణంగా బీహార్లో జన్ సూరాజ్ పాదయాత్రకు నెల రోజుల పాటు దూరంగా ఉండనున్నారు. గాంధీ జయంతి నాడు ప్రారంభమైన పాదయాత్ర ఇప్పుడు దాదాపు 15 రోజుల తర్వాత తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. ప్రశాంత్ కిషోర్ ఎడమ కాలి కండరం చిట్లినట్లు వైద్యులు తెలిపారు. కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. సమస్తిపూర్ లో ప్రశాంత్ కిశోర్ ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు.
“నాకు ఇతర ఏ ఆరోగ్య సమస్యలూ లేవు. చాలా దూరం నడవడం, ఇక్కడి రోడ్లు బాగోలేకపోవడం వల్లే నా కండరాలకు గాయమైంది. బిహార్ లోని మారుమూల ప్రాంతాలల్లోనూ పర్యటించాలని అనుకుంటున్నాను. అందుకు మరిన్ని నెలల సమయం పడుతుంది. పాదయాత్రను పూర్తి చేయడానికి వైద్య ప్రక్రియ పూర్తయ్యే వరకు విశ్రాంతి తీసుకుంటున్నాను’ అని చెప్పారు.
జన సురాజ్ పాదయాత్ర తర్వాత ఆయన పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశిస్తారా? అన్న విషయంపై స్పష్టత లేదు. ప్రశాంత్ కిశోర్ జేడీయూకి రాజీనామా చేశాక సొంతంగా పార్టీ పెడతారని ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఆయన రాజకీయ వ్యూహకర్త బాధ్యతలకు కూడా దూరంగా ఉంటున్నారు. పాదయాత్ర పూర్తయ్యాక సొంతంగా పార్టీ పెడతారన్న ప్రచారం జరుగుతోంది.