MDK: చేగుంట మండలం కర్నాల్ పల్లి కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్వాహకులను ఆదేశించారు. తుఫాన్ వర్షాల కారణంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని, కోతలు చేపట్టవద్దని సూచించారు. తహసీల్దార్ శివప్రసాద్, ఏపీఎం దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.