KNR: మొంథా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శంకరపట్నం మండలంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ ఉదయం నుంచే ఎడతేరిపే లేకుండా వర్షం పడతోంది. ఈ అకాల వర్షాలతో అన్నదాత ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఆరుగాలం పండించిన పంట కోసి ఆరబోయడానికి ఉంచిన వడ్లు వర్షానికి తడిసిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.