»These Are The Movies That Will Be Released In Theaters And Ott This Week
Movies: ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలివే
ఈ వేసవి(Summer)లో ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచేందుకు మరికొన్ని చిత్రాలు రెడీ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద బ్యాక్ టూ బ్యాక్ మూవీస్(Movies) ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సిద్ధమయ్యాయి.
ఈ వేసవి(Summer)లో ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచేందుకు మరికొన్ని చిత్రాలు రెడీ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద బ్యాక్ టూ బ్యాక్ మూవీస్(Movies) ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సిద్ధమయ్యాయి. గత వారం కస్టడీ(Custody), రామబాణం (Ramabanam) వంటి సినిమాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వారం కూడా మరిన్ని సినిమాలు(Movies) విడుదల కాబోతున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.
అన్ని మంచి శకునములే (Anni Manchi Shakunamule): టాలీవుడ్(Tollywood) యంగ్ హీరో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ కలిసి నటిస్తున్న చిత్రం అన్ని మంచి శకునములే. లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి ఈ మూవీని తెరకెక్కించారు. స్వప్నదత్, ప్రియాంకదత్ లు ఈ మూవీని నిర్మించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ సినిమా మే 18న విడుదలకు సిద్ధమైంది.
బిచ్చగాడు 2 (Bichagadu 2): తమిళ హీరో విజయ్ ఆంటోని స్వీయ దర్శకత్వంలో రూపొందిన సినిమా బిచ్చగాడు2. ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. బిచ్చగాడు సినిమా గతంలో విడుదలయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ పార్టుకు సీక్వెల్ గా బిచ్చగాడు2 రూపొందింది. మే 19వ తేదిన బిచ్చగాడు2 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఫాస్ట్ ఎక్స్ (Fast X): ఇప్పటి వరకూ ఫాస్ట్ అండ్ ప్యూరియస్ సిరీస్‌కు ముగ్దులైనవారు చాలా మంది ఉన్నారు. ఇందులో నటించిన విన్ డీజిల్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పుడు ఈ సిరీస్ నుంచి రాబోతున్న తర్వాతి పార్ట్ ఫాస్ట్ ఎక్స్. మే 19వ తేదిన ఈ మూవీ రిలీజ్ కానుంది.
థియేటర్లతో పాటుగా ఈ వారం ఓటీటీ(OTT)లో కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ (Webseries)లు విడుదల కానున్నాయి. సోనీ లివ్‌లో మే 19 నుంచి ఏజెంట్, కడిన కదోరమీ అంద కదహం (మలయాళం) సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. అదే రోజు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డెడ్ పిక్సెల్స్ అనే మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఇక నెట్ ఫ్లిక్స్ లో మే 19 నుంచి అయాలవాషి (మలయాళం), కథల్(హిందీ), బయీ అజైబి(ఇంగ్లీష్), మ్యూటెడ్ (ఇంగ్లీష్), నామ్ (సీజన్-2) స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్‌లో మోడ్రన్ లవ్ చెన్నై (తమిళ్) మూవీ మే 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది.