గతేడాది ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’తో డీసెంట్ హిట్ అందుకున్న అఖిల్.. ఈ ఏడాది ఏజెంట్‌గా మాసివ్ బ్లాక్ బస్టర్ అందుకోవడం పక్కా అని.. ఎదురు చూశారు అక్కినేని అభిమానులు. కానీ ఏజంట్ మాత్రం రోజు రోజుకి వెనక్కి వెళ్తునే ఉన్నాడు. 2022లో వస్తాడనుకున్న ఏజెంట్.. ఏకంగా 2023కి షిప్ట్ అయిపోయాడు. అయితే నెక్ట్స్ ఇయర్ ఆరంభంలో ఏజెంట్ రిలీజ్ అవుతుందని భావించారు. కానీ ఇప్పుడు మరింత వెనక్కి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ఆగష్టులో రిలీజ్ కావాల్సిన ఏజెంట్.. డిసెంబర్లో వస్తుందని అనుకున్నారు. ఆ తర్వాత సంక్రాంతికి రావడం పక్కా అని అన్నారు. కానీ సంక్రాంతి బరిలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలతో పొటీ పడడం రిస్క్ అనుకున్నాడు ఏజెంట్. దాంతో మహా శివరాత్రికి ఏజెంట్ రావడం ఖాయమన్నారు. కానీ ఇప్పుడు ఉగాదికి అంటున్నారు. ఉగాదికి అయితే ఏజెంట్‌కు పోటీ తక్కువగా ఉంటుందని భావిస్తోందట చిత్ర యూనిట్. అయితే ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ఏజెంట్.. ఉగాదికైనా వస్తుందా అనే సందేహాలు వెలువడుతున్నాయి. అసలు ఏజెంట్ ఎందుకు డిలే అవుతోందనే డౌట్స్ కూడా వస్తున్నాయి. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాను స్పై యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు. అఖిల్‌కు సాలిడ్ హిట్ ఇవ్వడమే సురేందర్ టార్గెట్. అందుకే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవడం లేదని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తుండగా, సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తోంది. మరి ఏజెంట్ ఉగాదికైనా వస్తాడో లేదో చూడాలి.