KDP: చెన్నూరు మండలం 4వ ఎంపీటీసీ పరిధిలో సోమవారం వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు నిత్యపూజయ్య ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య విద్యను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమైన చర్య అని నాయకులు విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జీఎన్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.