బాపట్ల: త్రవ్వకాలవ పక్కన నర్రా వారి వీధిలో ఓ ఇంటి యజమాని గ్యాస్ స్టవ్ మీద పాలు పెట్టి తాళం వేసి డ్యూటీకి వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. పాలు బాగా మరిగి మాడు వాసన రావడాన్ని స్థానికులు గుర్తించి, వెంటనే ఫైర్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించి గ్యాస్ స్టవ్ ట్యూనర్ను ఆపివేశారు.