కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక ఎన్నికల్లో పేద ప్రజల శక్తి తమను గెలిపించిందన్నారు. “ద్వేష పూరిత మార్కెట్ మూసివేయ బడింది. ప్రేమ దుఖానాలు తెరవబడ్డాయి” అపి రాహుల్ అన్నారు. కాంగ్రెస్ పేదప్రజల కోసం పోరాడిందని చెప్పారు. న్యూఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన… పేదప్రజల శక్తిమాత్రమే కాంగ్రెస్ ను గెలిపించిందన్నారు. ఈ విజయం ఇతర రాష్ట్రాలలో కూడా పునరావృతమవుతుందన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి క్యాబినెట్ సమావేశంలో ఇచ్చిన ఐదు హామీలను నెరవేరుస్తుందన్నారు.
రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రలో 22 రోజుల పాటు రాష్ట్రంలో క్యాంప్ చేశారు. ఈ కారణంగానే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చిందని పలువులు అభిప్రాయపడుతున్నారు. ఈ యాత్ర గత ఏడాది సెప్టెంబర్ 30న కర్ణాటకలో ప్రవేశించి చామరాజనగర, మైసూరు, మాండ్య, తుంకూరు, చిత్రదుర్గ, బళ్లారి, రాయచూర్ మీదుగా దాదాపు 22 రోజుల్లో 500 కి.మీ ప్రయాణించింది.
“ఈ విజయం పార్టీకి సంజీవినిలా పనిచేసింది. సంస్థను ఉత్తేజపరిచింది. నాయకులు మరియు కార్యకర్తల మధ్య లోతైన ఐక్యత, సంఘీభావాన్ని కలిగించింది” అని పార్టీ సీనియర్ నాయకులు జైరాం రమేష్ తెలిపారు.
“భారత్ జోడో యాత్ర భారత రాజకీయాల్లో ఒక నిర్దిష్ట ఒరవడిని ప్రారంభించింది, దీని కోసం భారతదేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు” అని పవన్ ఖేరా అన్నారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం కాంగ్రెస్లో ఉత్సాహాన్ని నింపిందని తెలిపారు.
కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, మాజీ సీఎం సిద్దరామయ్య వ్యక్తం చేసిన 120 సీట్ల అంచనాను అధిగమించింది. సీఎం బసవరాజ్ బొమ్మై ఓటమిని అంగీకరించారు. బీజేపీ ప్రస్తుతం 64సీట్ల ఆధిక్యంలో ఉంది. ఈ ఫలితాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వచ్చిన ఆదేశంగా అభివర్ణించారు సిద్ధరామయ్య, “ఈ ఎన్నికల ఫలితం లోక్సభ ఎన్నికలకు గీటురాయి. బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి బీజేపీని ఓడించాలని ఆశిస్తున్నాను. రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని అవుతారని ఆశిస్తున్నాను.” అని సిద్దరామయ్య చెప్పారు.