Karnataka Chikkaballapur Election result: Health Minister K Sudhakar defeated
brahmanandam: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు జరిగింది. బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కర్ణాటకలో బోల్తా కొట్టింది. కాంగ్రెస్ కి కన్నడ ప్రజలు జై కొట్టారు. ఈ ఎన్నికల ప్రచార సమయంలో.. ఓ బీజేపీ అభ్యర్థికి సినీ నటుడు బ్రహ్మానందం ప్రచారం చేశారు.
బీజేపీ నేత, ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ తరపున నాలుగు రోజులు చిక్ బల్లాపూర్ నియోజకవర్గంలో బ్రహ్మానందం ప్రచారం చేశారు. అయితే అక్కడ సుధాకర్ ఓడిపోయారు.
11,130 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ ఈశ్వర్ విజయం సాధించారు. ఈశ్వర్ కు 69,008 ఓట్లు రాగా, సుధాకర్ కు 57878 ఓట్లు పడ్డాయి. ఇక జేడీఎస్ అభ్యర్థి కేపీ బచే గౌడ 13,300 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.
ఏపీకి ఆనుకుని ఉన్న చిక్ బల్లాపూర్ నియోజకవర్గంలో తెలుగు ఓటర్లు అధికం. ఈ క్రమంలో గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సుధాకర్ తరపున బ్రహ్మానందం ప్రచారం చేశారు. ఆనాడు సుధాకర్ గెలుపొందారు. ఇదే సెంటిమెంట్ ను రిపీట్ చేయాలనే ఉద్దేశంతో.. సుధాకర్ తన ఫ్రెండ్ బ్రహ్మానందంతో చిక్ బల్లాపూర్ నియోజకవర్గంలో నాలుగు రోజులపాటు ప్రచారం చేయించారు. ఈ సారి ఈ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు.