దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దాంతో దేశ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. సోషల్ మీడియాలో సైతం చెర్రీ ఫ్యాన్ ఫాలోయింగ్ మరింతగా పెరుగుతోంది. తాజాగా ఇన్ స్టా అకౌంట్లో 10 మిలియన్ ఫాలోవర్స్‌ను దక్కించుకున్నాడు చరణ్. కేవలం ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత దాదాపు 20 లక్షల ఫాలోవర్స్‌ను చరణ్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో టాలీవుడ్ లో 10 మిలియన్ ఫాలోవర్స్ కలిగిన ఫాస్టెస్ట్ హీరోగా చరణ్ రికార్డు నెలకొల్పాడని అంటున్నారు. దీంతో 10 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్న ప్రభాస్, మహేష్ బాబు వంటి హీరోలను బీట్ చేశాడు చరణ్. ప్రభాస్ ఇంస్టాగ్రామ్లో 9 మిలియన్ల ఫాలోవర్స్ ఉండగా.. మహేష్ బాబుకి 9.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక టాలీవుడ్లో అత్యధిక సోషల్ మీడియా ఫాలోవర్స్‌ను కలిగిన హీరోగా మొదటి స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నాడు. దాదాపు 20 మిలియన్ల ఫాలోవర్స్‌ను బన్నీ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత స్థానంలో విజయ్ దేవరకొండ 17 మిలియన్ల ఫాలోవర్స్ కలిగి ఉన్నాడు. ఇకపోతే.. ప్రస్తుతం రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో ఆర్సీ15 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్‌లో జరుగుతోంది. అక్కడ ఓ విజువల్ గ్రాండియర్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. అందుకోసం ఏకంగా 15 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు టాక్. ఇక ఈ సినిమా తర్వాత ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు సానాతో ఆర్సీ 16 అనౌన్స్ చేశాడు చరణ్.