నిర్మల్: ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పలు మండలాల్లో పర్యటిస్తారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రతినిధులు తెలిపారు. శనివారం ఖానాపూర్ పట్టణంలోని మార్కెట్ కమిటీలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం, పెంబి, కడెం మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ, లబ్ధిదారులకు పత్రాలు అందజేత కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొంటారన్నారు.