Priyanka Miss World Won Time Her Husband Nick Age is 7 Years
Priyanka:ప్రియాంక చోప్రా జోనస్ (Priyanka).. పెళ్లి చేసుకొని హాలీవుడ్లో కూడా మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల జెన్నిఫర్ హడ్సన్ టాక్ షోలో భర్త నిక్‌తో (nick) కలిసి పాల్గొన్నారు. అందులో ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి. ప్రియాంక చోప్రా (Priyanka) 2000లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్నారు. ఆ సమయంలో ప్రియాంక వయస్సు 17 ఏళ్లు.. కాగా ఆమె భర్త నిక్ జోనస్ (nick) వయస్సు ఏడేళ్లే.. అవును తనకన్నా పదేళ్ల చిన్నవాడిని ప్రియాంక (Priyanka) పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
మిస్ వరల్డ్ టైటిల్ కోసం లండన్‌లో ఉన్నామని.. ఆ సమయంలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు అందరూ టీవీలకు అతుక్కుపోయారని ప్రియాంక (Priyanka) తెలిపారు. భర్త నిక్, అత్త, మామ కూడా టీవీ చూశారట. ఇదే విషయాన్ని షో లో ప్రియాంక చోప్రా (Priyanka) తెలిపారు. ఆ విషయం గుర్తుకు వస్తే వింతగా అనిపిస్తోందని వివరించారు.
ఏజ్ పరంగా తేడా ఉన్నప్పటికీ ప్రేమించి.. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం అని ప్రియాంక చోప్రా (Priyanka) చెబుతున్నారు. మేము కలవాలని రాసి ఉంది.. కాలమే ఇద్దరినీ కలిపిందని చెప్పారు. నిక్‌తో పెళ్లికి ముందు చాలామందితో డేట్ చేశానని.. నిక్కు కూడా రిలేషన్ షిప్స్ ఉన్నాయని తనతో చెప్పారని తెలిపారు. జరిగిపోయిన వాటి గురించి ఇద్దరం ఆలోచించమని.. భవిష్యత్ కోసం అడుగులు వేయడమే తమకు ఇష్టమని వివరించారు. ప్రస్తుతం ప్రియాంక వయస్సు 40 ఏళ్లు కాగా.. నిక్ ఏజ్ 30.