VKB: నవాబుపేట్ మండలం వట్టిమినేపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ మోముల వెంకట్ రామ్ రెడ్డి (35) బ్లడ్ క్యాన్సర్తో కొంతకాలంగా బాధపడుతున్నారని స్థానికులు తెలిపారు. చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చేరిన ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారని చెప్పారు.