SKLM: ఈనెల 27న శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో జరగనున్న ప్రజా ఫిర్యాదులు నమోదు మరియు పరిష్కార వేదిక రద్దు చేస్తున్నట్లు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అహమ్మద్ ఫర్మాన్ ఖాన్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మోంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లా అధికారులు పర్యవేక్షణలో ఉంటారని ఆయన తెలియజేశారు. మండలాల్లో సైతం రద్దు చేస్తున్నామన్నారు.