కర్ణాటక 2023 అసెంబ్లీ ఎన్నికల(Karnataka assembly Elections 2023)కు నిన్న ఓటింగ్ జరిగింది. అయితే రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం కర్ణాటకలో 72.67 శాతం పోలింగ్ నమోదైంది. ఈరోజు తుది గణాంకాలు తెలుస్తాయని ఈసీ పేర్కొంది. మరోవైపు ఎగ్జిట్ పోల్స్(exit poll) సర్వేలు నిజమవుతాయో లేదో ఇప్పుడు చుద్దాం.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2023(Karnataka assembly Elections 2023) బుధవారం ముగియగా, ఎన్నికల సంఘం వివరాల ప్రకారం 72.67 శాతం ఓటింగ్ నమోదైంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన 72.36 శాతం ఓటింగ్ కంటే ఇది ఎక్కువ కావడం విశేశమనే చెప్పాలి. మరోవైపు తుది గణాంకాలు ఈరోజు తెలుస్తాయని ఈసీ వెల్లడించింది.
మేలుకోటే జిల్లాలో అత్యధికంగా 90 శాతం పోలింగ్ నమోదైంది. కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(siddaramaiah) స్థానం వరుణలో 84 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. కొంతమంది గ్రామస్తులు పోల్ ఆఫీసర్పై దాడి చేసిన సంఘటనతో సహా కొన్ని ప్రాంతాల్లో హింస చోటుచేసుకుంది. మరికొన్ని చోట్ల పలు పార్టీలకు అనుకూలంగా ఓటు వేయిస్తున్నారనే ఆరోపణలతో పలువురిపై కేసులు నమోదయ్యాయి.
ఇక కర్ణాటకలో అధికార బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress), జేడీఎస్(JDS)ల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. పోలింగ్ ముగిసినందున, చాలా ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని తెలిపాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు మే 13న వెల్లడి కానున్నాయి. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారం కాంగ్రెస్ 122 నుంచి 140 సీట్లు వస్తుందని అంచనా వేయగా, న్యూస్24-టుడే చాణక్య ఎగ్జిట్ పోల్ గ్రాండ్ ఓల్డ్ పార్టీ గెలుస్తుందని అంచనా వేసింది.
ఎగ్జిట్ పోల్ రిపోర్టుల తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(basavaraj bommai) తాను గ్రౌండ్ రిపోర్టును నమ్ముతానని చెప్పారు. మేము పూర్తి మెజారిటీని పొందుతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితమైనవి కావని అన్నారు. ఇది 5 నుంచి 10 శాతం మారే అవకాశం ఉందన్నారు. స్పష్టత కోసం మే 13 వరకు వేచి చూద్దామని వెల్లడించారు.
అయితే అసలు ఎగ్జిట్ పోల్స్(exit poll) సర్వే నిజమవుతుందా అంటే కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే గతంలో కూడా కొన్ని సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ కు విరుద్ధంగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. తప్పకుండా గెలుస్తారని అనుకున్న క్రమంలో కూడా ఓడిన ప్రాంతాలు ఉండగా..మెజారిటీ వస్తుందనుకున్న పార్టీకీ కూడా రాకపోవడం ఇదివరకు జరిగింది. అయితే మరి కర్ణాటక ఎన్నికల్లో ఎలా ఉండబోతుందో చూడాలి.