WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని KGVB పాఠశాలలో హెల్ప్ కుక్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు SO కరుణ శ్రీ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో ఆమె మాట్లాడుతూ.. మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 7వ తరగతి ఉత్తీర్ణులైన వారు ఈనెల 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులు పాఠశాలలోనే దరఖాస్తు సమర్పించాలని స్పష్టం చేశారు.