ప్రకాశం: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న కోటి సంతకాల కార్యక్రమం త్వరితగతిన పూర్తిచేయాలని మాజీ మంత్రి, వైసీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇంఛార్జ్ మేరుగు నాగార్జున అన్నారు. మద్దిపాడులోని పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్యకళాశాలలకు ప్రైవేటీకరణకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.