»This Is The Title Of Pawan And Sai Dharam Tej Movie Bro
Pawan:ని ‘బ్రో’ అంటున్న సాయి ధరమ్ తేజ్!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan), సాయి ధరమ్ తేజ్(sai dharam tej) కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ మూవీ వినోదయ సీతంను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్ తెరకెక్కించిన సముద్రఖనినే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జూలై 28న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమాకు ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ వినిపిస్తోంది.
ఇప్పటికే పవన్ కళ్యాణ్(pawan kalyan) పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేసేశారు. 20 నుంచి 25 రోజుల్లోనే పవన్ పోర్షన్‌ను ఫినిష్ చేశారు. దీని కోసం పవన్ ఏకంగా రూ.45 కోట్ల వరకు పారితోషికం అందుకున్నాడు. ఇక పవన్ పార్ట్ షూటింగ్ అయిపోవడంతో.. మిగతా బ్యాలెన్స్ షూటింగ్‌ను శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఒక సాంగ్ కోసం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో భారీ సెట్ వేస్తున్నట్టు తెలుస్తోంది.
వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అలాగే టైటిల్ అనౌన్స్ మెంట్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీ టైటిల్‌ని మే 10న అఫిషీయల్‌గా ప్రకటించే ఛాన్స్ ఉందంటున్నారు. ఒక షార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టైటిల్‌ని లాక్ చేసినట్టుగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
జస్ట్ ‘బ్రో(Bro)’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారట. ఈ సినిమాలో పవన్ దేవుడుగా కనిపించనున్నాడు. అయినా సాయి ధరమ్ తేజ్(sai dharam tej), పవన్‌ని ‘బ్రో’ అని పిలుస్తాడట. అందుకే ఈ టైటిల్‌ని ఫైనల్ చేసినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు ‘బ్రో(Bro)’ అనే టైటిల్ సెట్ అవుతుందా? అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కొందరు పవన్ ఫ్యాన్స్ మాత్రం.. ఇలాంటి టైటిల్ పెట్టడం ఏంటి? అంటూ సోషల్ మీడియా స్టేజ్‌పై చర్చించుకుంటున్నారు. అయితే గతంలో ఈ సినిమాకు దేవుడు, దేవుడే దిగి వచ్చిన అనే టైటిల్స్ వినిపించాయి. కాబట్టి ‘బ్రో’ అనే టైటిల్‌ను ఇప్పుడే కన్ఫామ్ చేయలేం.