ప్రకాశం: కనిగిరి నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు మంగళవారం రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి రానున్నట్లు కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. కనిగిరిలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ, కంచర్ల వారి పల్లి హైస్కూల్లో నూతన హాస్టల్ భవనాన్ని ప్రారంభించనున్నారు.