ONDC:ఓఎన్డీసీ..ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్.. ఫుడ్, గ్రొసరీ డెలివరీ చేస్తూ స్విగ్గీ (swiggy), జొమాటో (zomato) యాప్స్‌కు సవాల్ విసురుతోంది. దేశంలో ఇప్పటివరకు స్విగ్గీ, లేదంటే జొమాటో యాప్స్‌దే హవా.. రకరకాల ఆఫర్లు పెట్టి.. వినియోగదారులను ఆకట్టుకుంటాయి. మిగతా ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చినప్పటికీ అంతగా సక్సెస్ కాలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోతుంది.
స్విగ్గీ, జొమాటోకు (zomato) ONDC రూపంలో థ్రెట్ వచ్చింది. ఆ రెండింటీ కన్నా తక్కువ ధరకు (rate) ఫుడ్ అందిస్తోంది. దీంతో డెలివరీ సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ (hyderabad), బెంగళూర్ (bengalure), ఢిల్లీ (delhi) సహా 240 నగరాల్లో అందుబాటులో ఉంది. ఆహారంతోపాటు నిత్యావసర సరుకులు విక్రయిస్తూ ముందుడుగు వేసింది. రోజువారీ డెలివరీల సంఖ్య 10 వేల దాటిందంటే ONDCకి ప్రజల ఆదరణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ONDC అంటే డిఫరెంట్.. దీనికి సొంతంగా యాప్ లేదు. పేటీఎం (paytm), మై స్టోర్ (my store), పిన్ కోడ్ (pincode), స్పైస్ మనీ (spice money) యాప్స్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలి. ఇదీ కొంచెం మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. అయినప్పటికీ జనం నుంచి ఆదరణ లభిస్తోంది. రెస్టారెంట్స్‌కు వెళ్లిన సమయంలో ధర, జొమాటో (zomato), స్విగ్గీలో (swiggy) ధర తేడా ఉంటుంది. అదనంగా డెలివరీ ఛార్జీలు కూడా వేస్తారు. దీంతో కొందరు స్విగ్గీ, జొమాటోలో వచ్చే ఫుడ్.. ONDC ద్వారా వచ్చే ఫుడ్ ధరను కంపేర్ చేస్తూ స్క్రీన్ షాట్లను షేర్ చేస్తున్నారు.
ONDC సేవలు ఇప్పుడిప్పుడే విసృతం అవుతున్నాయి. దీంతో అన్ని రెస్టారెంట్లు, పిక్ కోడ్స్లలో లభించకపోవచ్చు. భవిష్యత్‌లో మాత్రం అన్ని చోట్ల లభించే అవకాశం ఉంది. అలా అయితే జొమాటో, స్విగ్గీలపై ఇంపాక్ట్ చాలానే ఉంటుంది.