»Prabhas Canceled The Huge Project With Siddharth Anand
Prabhas: హ్యాండ్ ఇచ్చాడా? ఆ భారీ ప్రాజెక్ట్ ఆగిపోయిందా!?
ప్రస్తుతం ఎక్కడ చూసిన ఆదిపురుష్ హంగామానే కనిపిస్తోంది. ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను జూన్ 16న విడుదల చేయనున్నారు. దాంతో ఆదిపురుష్ ట్రైలర్‌ను మే 9న రిలీజ్ చేయనున్నామని ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్‌కు సర్వం సిద్దమైంది. ఈ ట్రైలర్ కోసమే ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్ ఎదరు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభాస్ లైన్లో ఉన్న ఓ భారీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రభాస్(Prabhas) వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, మారుతితో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ మూవీ కమిట్ అయ్యాడు. వీటితో పాటు బాలీవుడ్లో ఓ భారీ ప్రాజెక్ట్ కూడా కమిట్ అయ్యాడు. ఇటీవలె షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీతో సాలిడ్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్(siddharth anand). ఈయనతోనే ప్రభాస్ ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. ఈ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నట్టు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. సిద్దార్ద్ ఆనంద్కి భారీగా అడ్వాన్స్ కూడా ఇచ్చారట. వచ్చే ఏడాదిలో ఈ సినిమా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశారు.
అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్(cancel)అయిందనే న్యూస్ వైరల్‌గా మారింది. సిద్ధార్థ్ అడ్వాన్స్‌ను తిరిగి ఇచ్చేశాడని.. అగ్రిమెంట్ రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. దానికి కారణం ప్రభాస్, సిద్దార్థ్‌లకు డేట్స్ కుదరకపోవడమేనని అంటున్నారు. ప్రభాస్ లైనప్ గురించి అందరికీ తెలిసిందే. అలాగే సిద్ధార్థ్ కూడా ‘ఫైటర్’, ‘టైగర్ వర్సెస్ పఠాన్’ లతో బిజీగా ఉన్నాడు. ‘ఫైటర్ 2’ కూడా ప్లాన్ చేస్తున్నట్టు ఇటీవలే వార్తలు కూడా వచ్చాయి.
దాంతో ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్(project) కష్టమని చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. ఫ్యూచర్లో ఈ కాంబినేషన్ సెట్ చేసుకునేలా ఓ మాట అనుకుని డ్రాప్ అయ్యారట. దీంతో.. దాదాపుగా ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లేనని సమాచారం. మరో వెర్షన్ ప్రకారం.. ఇటీవలే మైత్రీ సంస్థపై ఐటీ దాడుల జరిగాయి. ఇలాంటి సమయంలో పెద్ద ప్రాజెక్ట్స్ రిస్క్ అని భావిస్తున్నారట మైత్రీ మూవీ మేకర్స్. మొత్తంగా సిద్ధార్థ్ ఆనంద్, ప్రభాస్ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టే!