»Bjp Chief Nadda Watches The Kerala Story With Students Says Film Exposes New Type Of Terrorism
JP Nadda: కేరళ స్టోరీ చూసిన జేపీ నడ్డా.. రియాక్షన్ ఇదే..!
కేరళ స్టోరీ(The Kerala Story) ఓ విషపూరిత ఉగ్రవాదాన్ని బట్టబయలు చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(jp adda) అన్నారు. తుపాకులు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో కూడిన ఉగ్రవాదం గురించి మనం విన్నాం. కానీ ఇది మరొక ప్రమాదకరమైన ఉగ్రవాదమని వ్యాఖ్యానించారు. ఈ సినిమా చూసిన సందర్భంగా నడ్డా ఈ కామెంట్స్ చేయడం విశేషం.
వివాదాస్పదమైన ‘ది కేరళ స్టోరీ(The Kerala Story)’ సినిమా కొత్త తరహా ఉగ్రవాదాన్ని బయటపెట్టిందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) అన్నారు. ఎలాంటి తుపాకులు, తూటాలు లేకుండానే టెర్రరిజాన్ని ఎలా వ్యాప్తి చేస్తున్నారో ఈ చిత్రం చూపిందని చెప్పారు. ఆదివారం రాత్రి బెంగళూరులో ఈ మూవీని చూసిన ఆయన.. ‘న్యూ టైప్ ఆఫ్ టెర్రరిజం’ గురించి తామిప్పుడు తెలుసుకున్నామన్నారు.
ఉగ్రవాద కార్యకలాపాల కోసం తూటాలు, బాంబులు, ఆటోమాటిక్ ఆయుధాలను వాడుతారని తాము విన్నామని, కానీ అవేవీ లేకుండానే ప్రమాదకరమైన ఉగ్రవాదం ఉందన్న విషయాన్ని ఈ చిత్రం ఎక్స్ పోజ్ చేసిందని ఆయన చెప్పారు. విషపూరితమైన ఈ తరహా టెర్రరిజాన్ని, దాని వెనుక జరిగే కుట్రలను ఇది ప్రతి బింబించిందన్నారు. అయితే దీన్ని ప్రత్యేకంగా రాష్ట్రానికి గానీ, మతానికి గానీ అన్వయించరాదన్నారు.
తప్పుడు దారిలో ప్రయాణిస్తున్న మన యువత(youth)కు ఈ సినిమా కనువిప్పు వంటిదని, అందరూ దీన్ని చూడాలని తాను అభిప్రాయపడుతున్నానని నడ్డా పేర్కొన్నారు. ప్రధాని మోడీ(pm modi) కూడా ఈ చిత్రాన్ని ప్రశంసించారన్నారు.
ఇదిలా ఉండగా, ఇప్పటికీ ఈ సినిమా(movie)ని నిలిపివేసేందుకు పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మూవీ విడుదలపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో తమిళనాడు(tamilnadu)లోని థియేటర్ల యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. చిత్రాన్ని ప్రదర్శించకూడదని నిర్ణయించాయి.
ఆన్లైన్ టికెట్ బుకింగ్ నుంచి తొలగించాయి. రాష్ట్రంలో 13 థియేటర్లలో సినిమాను ప్రదర్శిస్తున్నారు. మల్టీపెక్స్‌లో ది కేరళ స్టోరీ సినిమా ప్రదర్శించడంతో ఇతర చిత్రాలపై ప్రభావం పడుతుందని థియేటర్ల యాజమానులు పేర్కొంటున్నారు.
శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందనే కారణంతో చిత్రాన్ని ప్రదర్శించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తమిళనాడు మల్టీప్లెక్స్ అసోసియేషన్ పేర్కొంది. మల్టీప్లెక్స్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తే.. ఇతర సినిమాలకు సైతం ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని, అలాగే తమ ఆదాయాన్ని సైతం ప్రభావిస్తుం చేస్తుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ తెలిపింది.