MNCL: నిరుద్యోగ యువతకు శుక్రవారం మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ తెలిపారు. మెరీనా ప్లాంట్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 2190 పోస్టులకు మేళ నిర్వహిస్తున్నారు. పది, ITI, డిగ్రీ, ఎంబీఏ చేసి 18 నుంచి 40 ఏళ్ల లోపు వారు అర్హులన్నారు. సీవీ రామన్ డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించారు.