»Ys Sharmila Complaint Begum Bazar Police Station Against Minister Ktr
Paper Leakపై మంత్రి కేటీఆర్‌పై వైఎస్ షర్మిల ఫిర్యాదు
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో దర్యాప్తు చేస్తోన్న సిట్‌పై తమకు నమ్మకం లేదని వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల అన్నారు. బేగం బజార్ పోలీస్ స్టేషన్లో మంత్రి కేటీఆర్ మీద ఈ రోజు ఫిర్యాదు చేశారు.
YS Sharmila Complaint Begum bazar police station Against Minister KTR
YS Sharmila:టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీపై విపక్షాల పోరుబాట కొనసాగుతోంది. వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ఈ రోజు బేగంబజార్ పోలీస్ స్టేషన్లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌పై (ktr) ఫిర్యాదు చేశారు. పేపర్ లీకేజ్‌పై సిట్ విచారణ ప్రగతి భవన్ నుంచి జరుగుతుందని సంచలన ఆరోపణలు చేశారు. ఆ దర్యాప్తుపై నమ్మకం లేకపోవడంతో కంప్లైంట్ చేశానని వివరించారు.
పేపర్ లీకేజీకి సంబంధించి లోన ఉన్న ఓ టెక్నికల్ వ్యక్తికి ఐపీ అడ్రస్, పాస్ వర్డ్ తెలిసినంత మాత్రాన యథేచ్చగా హ్యాక్ చేసి పేపర్ లీక్ చేశారని.. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని షర్మిల (YS Sharmila) విమర్శించారు. రాష్ట్రంలో పాస్ వర్డ్ తెలిస్తే ఏదైనా హ్యక్ చేయొచ్చా? పాస్ వర్డ్ హ్యక్ చేశారంటే ఇది ఐటీ శాఖ వైఫల్యమేనని షర్మిల (YS Sharmila) అన్నారు. ఏ రాష్ట్రంలో అయినా ఐటీ లా -2000 ప్రకారం ప్రభుత్వ శాఖలో ఉన్న అన్ని సిస్టమ్స్‌కి ఉండాల్సిన డాటా భద్రత, ఆడిట్ అన్ని ఐటీ శాఖ పరిధిలోకే వస్తాయని పేర్కొన్నారు. ఐటీ మంత్రి కేటీఆర్ (ktr) మాత్రం మాకు ఏ సంబంధం అని అంటున్నారని గుర్తుచేశారు
సిట్ (sit) దర్యాప్తు చేసి దోషులు ఎవరని చెప్పకముందే కేటీఆర్ (ktr) ఇద్దరేతప్పు చేశారని ఎలా చెబుతారని అడిగారు. పేపర్ లీకులపై కేటీఆర్‌కి, కేటీఆర్ పీఏ కి సబంధం ఉందని ఆరోపించారు. వాళ్ల ఊర్లో పేపర్లు లీకైంది కాబట్టే తీగ లాగితే వాళ్ల డొంక కదులుతుందని సిట్‌ను వేశారని వివరించారు. సిట్‌లో (sit) ఎవరి పేర్లుండాలి, దోషులుగా ఎవరిని చేర్చాలి, ఏ దిశగా దర్యాప్తు చేయాలనేది ప్రగతి భవన్ నిర్ణయిస్తుంది. సిట్‌లో ఇతరుల ప్రమేయం లేదన్నట్టు పది మందిని దోషులుగా చూపించి పెద్ద వారని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
రాష్ట్రంలో ప్రతి సిస్టంకు ఆడిట్ జరగాలని షర్మిల కోరారు. ఆ సిస్టంకు డిజిటల్ సెక్యురిటీ ఉందా? ఫైర్ వాల్స్ ప్రొటెక్షన్ ఉందా? అథెంటికేషన్ లెవెల్స్ ఉన్నాయా? భద్రత సంబంధిత విషయాలపై పై అధికారి ఓటీపీ, ఫింగర్ ప్రింట్ వంటి పద్ధతులు ఉన్నాయా లేదా? ప్రభుత్వ పరిధిలో ప్రతి సిస్టంకు ఆడిట్ జరగాలని కోరారు. ఆడిట్ చేస్తే దానికి సంబంధించిన సర్టిఫికెట్లు ఉంటాయి. టీఎస్ పీఎస్సీ కేసులో ఆ సర్టిఫికేట్లు బయటపెట్టాలని కోరారు.
రాష్ట్రంలో మళ్లీ ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహిస్తున్నారు.. ఆ పేపర్స్ తిరిగి హ్యాక్ అవ్వదని గ్యారంటీ ఏంటి? అని షర్మిల (YS Sharmila) అడిగారు. సెక్యూరిటీ కల్పించిన సంగతి ప్రజలకు తెలియాలి కదా అన్నారు. మంత్రి కేటీఆర్ , ఆయన శాఖపై ఫిర్యాదు చేశామని.. వారిపై విచారణ జరగాలని షర్మిల అంటున్నారు.