External Affairs Minister Jaishankar Shake Hand to PAK Minister Bilawal Bhutto
External Affairs Minister Jaishankar:గోవాలో (Goa) జరుగుతోన్న షాంఘై సహకార సంస్థ సదస్సులో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ (Bilawal Bhutto) కూడా పాల్గొన్నారు. భారత్‌తో ఎలాంటి ధ్వైపాక్షిక చర్చలు జరపబోమని పాకిస్థాన్ ప్రకటించింది. సదస్సులో బిలావల్ భుట్టోతో (Bilawal Bhutto) జై శంకర్ (Jaishankar) షేక్ హ్యాండ్ ఇచ్చారు. అసలు ఏ అంశంపై చర్చలు ఉండవని పేర్కొనగా.. జై శంకర్ మర్యాదపూర్వకంగా షేక్‌హ్యాండ్ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన అతిథులకు గురువారం రాత్రి జై శంకర్ (Jaishankar) బెనాలిమ్ సముద్ర తీరంలో గల తాజ్ రిసార్ట్‌లో విందు ఇచ్చారు. చైనా, రష్యా, ఉజ్బెకిస్థాన్, కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజకిస్థాన్ విదేశాంగ మంత్రులు హాజరయ్యారు. విందుకు పాక్ మంత్రి బిలావల్ భుట్టో కాస్త ఆలస్యంగా వచ్చారు. దీంతో జై శంకర్ (Jaishankar)- భుట్టో (Bhutto) మాట్లాడుకుంటారా అనే చర్చ జరిగింది. ఇద్దరు కరచాలనం చేసుకుని.. పలకరించుకున్నారని తెలిసింది. వీరి భేటీని పాకిస్థాన్ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి.
ఎస్సీవో చార్టర్ పట్ల ఉన్న నిబద్దతను తెలియజేసేందుకు సదస్సుకు హాజరవుతున్నానని అంతకుముందు భుట్టో (Bhutto) ఓ వీడియో విడుదల చేశారు. తమతో కలిసి వచ్చే దేశాలతో చర్చలు జరుపుతామని కూడా పేర్కొన్నారు. జై శంకర్‌తో (Jaishankar) మాత్రం చర్చలు ఉండబోవని తేల్చిచెప్పారు. ఇంతలో షేక్ హ్యాండ్ ఇవ్వడం.. పలుకరించుకోవడం ఆస్తికరంగా మారింది.
— Khaleek kohistani (@KhalekKohistani) May 5, 2023
రష్యా, చైనా విదేశాంగ మంత్రులు సెర్గే లవ్రోచ్, చిన్ గ్యాంగ్‌లతో జై శంకర్ (Jaishankar) వేర్వేరుగా చర్చలు జరిపారు. చైనా మంత్రి చిన్తో తూర్పు లడాఖ్‌లో గల వాస్తవ నియంత్రణ రేఖ వివాద పరిష్కారం, రష్యా మంత్రి లవ్రోవ్తో ఎస్సీవో, జీ 20, బ్రిక్స్ అంశాలపై చర్చలు జరిపారు. అంతకుముందు సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా పాక్ మంత్రి భుట్టోకు (Bhutto) జై శంకర్ ఆహ్వానించారు. ఇద్దరు కలిసి ఫోటో దిగారు. వేదిక వద్దకు వెళ్లాలని భుట్టోను జై శంకర్ పంపించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#India's EA Minister JaiShankar receives #Pakistan FM Bilawal Bhutto Zardari on the arrival podium ahead of the commencement of the SCO CFM. NO Handshakes between both. Dr Jai Shankar does Namaste to Pakistani FM. #SCO2023pic.twitter.com/7N4hHi6PyK