స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో తన అభిమానులను అలరించడానికి వస్తోంది. నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి మహేష్ బాబు దర్శకుడు. అయితే ఈ చిత్ర టీజర్ చూసిన రామ్ చరణ్(ram charan) స్పందించారు.
అనుష్క చాలా కాలం తర్వాత స్క్రీన్ మీద కనిపించనుంది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా తర్వాత ఆమె త్వరలోనే మన ముందుకు రానున్నారు. చాలా కాలం తర్వాత అనుష్క సినిమా వస్తుండటంతో అందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో అనుష్క సరసన నవీన్ పొలిశెట్టి నటిస్తున్నాడు.
కాగా, నిజానికి ఈ సినిమాను ఈ నెల 26వ తేదీనే విడుదల చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల చేత సినిమా విడుదల తేదీని వాయిదా వేశారు. మేలో రావాల్సిన సినిమాని జూన్ చివరి వారంలో కానీ, జులై మొదటి వారంలో కానీ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని ఇటీవల విడుదల చేశారు. కొత్తగా ఉన్న ఈ మూవీ టీజర్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇదే విషయాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan) కూడా చెప్పడం విశేషం. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టీజర్ గురించి ట్వీట్ చేస్తూ చిత్ర యూనిట్ ని సర్ప్రైజ్ చేశారు. తనకు టీజర్ చాలా బాగా నచ్చింది అంటూ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టీజర్ నాకు చాలా బాగా నచ్చింది. రెప్రెషింగ్ గా అనిపిస్తోంది. చిత్ర యూనిట్ కి గుడ్ లక్ అని ట్వీట్ చేశారు. రామ్ చరణ్ ట్వీట్ తో ప్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అనుష్క సినిమాకి చరణ్ సపోర్ట్ ఇవ్వడంతో అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పి.మహేష్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. యంగ్ హీరో సరసన అనుష్క శెట్టి జత కట్టడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఇలా ఉండబోతోంది. అసలు ఈ చిత్రంలో అనుష్క గ్లామర్…నవీన్ కామెడీ టైమింగ్ ఎలా ఉండబోతున్నాయి అనే ఉత్కంఠ ఆడియన్స్ లో ఉంది.